ఆ పని చేసేందుకు, తోడుగా నడిచేందుకు, మలుపులు

అందంగా త్రిప్పేందుకు, మల్లెల మాటలను తేనెల

పాటలుగా మలచి దారి బత్తెముగా ఈ పుస్తకాన్ని

అందిస్తున్నాం. ఒక మంచి మార్గగామిని తోడుగా

పంపుతున్నామని తృప్తి చెందుతున్నాం.

పాటలుగా పుస్తకంలో శబ్దంగా ఆడియోలో

శబ్దంగా, దృశ్యంగా వీడియోలో

మీ తోడు ఉండే ఈ మార్గగామి రామజోగి. మార్గంలో

మీకు ఉపకరించే ఎన్నో చిట్కాలు అతని వద్ద ఉన్నాయి.

అవే రామజోగి చిట్కాలు. అడిగితే అందుతాయి. అడుగు

ముందుకేస్తే అందాలు చిందుతాయి. ఆనందాలు విందు

చేస్తాయి.

వెళ్ళిరండి. మేమూ వస్తాము. అనంతంలో మళ్ళీ

కలుస్తాము.


 నమస్తే తెలంగాణ ***** హైదరాబాద్, శనివారం 30 నవంబర్ 2024 3

దీక్ష స్ఫూర్తితో కాంగ్రెస్ను దించుదాం

కేసీఆర్ అనవాళ్లు తీసేస్తు అంటున్నవ్... ఏ ఆనవాళ్లు తీసేస్తావ్ రేవంత్రెడ్డి... 

అల్గునూర్లో   కేసీఆర్ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళను తీసేస్తవా? 

ఖమ్మం జైలులో కేసీఆర్ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళను తీసేస్తవా? 

రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తెచ్చిన డిసెంబర్ 9 ఆనవాళ్లు లేకుండా

చేస్తవా? 2014, జూన్ 25 ప్రమాణస్వీకారం చేసిన చరిత్రను

తీసేస్తవా? - హరీష్ రావు

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్

తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని, తలసరి

ఆదాయంలో, ధాన్యం పండించడంలో, జీఎస్ డీపీలో, తాగునీటి సరఫరాలో,

నిరంతర విద్యుత్తులో దేశానికి దిక్సూటిగా నిలిపారని హరీశ్ గుర్తుచేశారు. కాంగ్రెస్

వచ్చాక రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ , న్యూట్రిషన్ కిట్ ఇలా అన్ని

బంద్ అయ్యాయని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంపై కేసీఆర్ కు, బీఆర్స్ కు 

ఉన్నంత ప్రేమ  ఏ పార్టీకీ ఉండదని స్పష్టంచేశారు.

తెలంగాణ వచ్చుడో  కేసీఆర్ సచ్చుడో అనే నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం

మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిండ్రు.. "ది  కోయిలేషన్ ఈయర్స్

1996–2012' పుస్తకంలో కేసీఆర్ నిబద్ధత గురించి మాజీ రాష్ట్రపతి ప్రముఖ ప్రణబ్ ముఖర్జి  ప్రస్తావించిండ్రు.. కేంద్రంలో ఏ శాఖ కావాలని కేసీఆర్ను అడిగితే.. 

ప్రణబ్జీ  నా లక్ష్యం మీకు తెలుసు . ఏశాఖను కేటాయించారనేది ముఖ్యంకాదు.. 

నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని కేసీఆర్ చెప్పారని ప్రణబ్ తన పుస్తకంలో రాసుకున్నరు.. ఆది కేసీఆర్ కమిట్మెంట్ కు నిదర్శనం - హరీష్ రావు


కేసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఉద్యమంలో జై తెలంగాణ ఆన్నోళ్ళ 

మీద తుపాకీ ఎక్కుపెట్టిన నీ రేవంత్ రెడ్డి) మరక నిన్ను వెంటాడుతది.. రాజీనామా చేయకుండా వెన్ను చూపిన నీ  మరక నిన్ను వెంటాడుతది ... తెలంగాణ

రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు నిలిచి ఉంటది. రాష్ట్రాన్ని కాపాడుకునే

క్రమంలో ఆ రోజు కొందరు వచ్చి చేరిండ్రు...ఇప్పుడు పాలేవో నీళ్ళేవో  తెలిసింది.

ఆ దొంగలను మళ్లీ రానిచ్చే ప్రసక్తే లేదు. - హరీష్ రావు

సిధ్ధిపేట లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి జై తెలంగాణ నినాదాలు చేస్తున్న హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, యాదవరెడ్డి, వంటేరు, నాగిరెడ్డి రాధాకృష్ణశర్మ తదితరులు

*************************************************************************************

కేసీఆర్ దీక్షతోనే సబ్బండ వర్గాల ఏకం కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా?

రాష్ట్రాన్ని నం.1గా నిలిపిన చరిత్ర ఆయనది. రేవంత్ ఎన్నడన్న జైతెలంగాణ అన్నడా?

తెలంగాణ కోసం రాజీనామా చేసిండా? మాపై 350కి పైగా ఉద్యమ కేసులున్నయి.

రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా? సిద్దిపేట దీక్షా దివస్ లో మాజీ మంత్రి హరీశ్ కేసీఆర్ నిబద్ధతే, చిత్తశుద్ధి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మాజీ 

మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. "కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ సర్కారు గద్దె దించేదాకా  అందరం ఒక్కటై కొట్లాడుదామని సంకల్పం తీసుకుందాం... లగచర్లలో కొట్లాడింది బీఆర్ఎస్.. హైడ్రాకు వ్యతిరేకంగా కొట్లాడింది. బీర్ఎస్.. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కొట్టాడుతున్నది బీఆర్ఎస్.. నాటి ఉద్యదు స్ఫూర్తితో ముందుకుసాగి బీఆర్ఎస్ ప్రభుత్యాన్ని తెచ్చుకుందాం' అని పిలుపు నిచ్చారు. దీక్షా దివస్ ను పురస్కరించుకొని

ముందుగా సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్ లో  తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ జిల్లా

అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సీనియర్ నాయ

కులు వంటేరు ప్రతాప్రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, రాజనర్సు , సంపత్ రెడ్డి , వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేశారు. అనంతరం రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. పార్టీజిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రదర్శనను తిలకించారు. ఉద్యము జ్ఞాపకాలనుగుర్తు చేసుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ.. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపడంతోనే ప్రత్యేక

రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందని గుర్తుచేశారు.

1969 ఉద్యమంలో 363 మంది చనిపోయారని, ప్రొఫెసర్ జయశంకర్ జీవితమంతా తెలంగాణ కోసం అంకితేం చేశారని చెప్పారు. కేసీఅర్ లాంటి నాయకుడు రాకపోతాడా! అనిnజయశంకర్ సార్ తపించారని, అదే సమయంలో కరెంట్ బిల్లులు పెరగడంతో నాకు రైతుల కోసం జై తెలంగాణ అని కేసీఆర్ బయల్దేరారని, 2001 ఏప్రియల్ 27న జల దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని గుర్తుచేశారు పార్టీ ఏర్పడిన తొలినాళ్లలోనే కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్తులను గెలుపొందామని, 2004లో తెలంగాణ ఇస్తామని ఒప్పుకుంటేనే కాంగ్రెస్తో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. దాదాపు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని, యూపీఏ ప్రత్వం ఏర్పడినప్పుడు తాను మంత్రి పదవి కోసం ఢిల్లీకి రాలేదని.. తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని కేసీఆర్ చెప్పారని, నాడు పట్టుబట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్లో తెలంగాణను పొందుపరిచేలా కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని వివ రించారు. నాటి రాష్ట్రపతి ఉభయ పార్లమెంట్ సభల్లో తెలంగాణ ఏర్పాటు గురించి చెప్పారని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో

రాశారని గుర్తుచేశారు. కేసీఆర్ ఆ నిబద్ధతే, నిజాయితీ చూశానని పుస్తకంలో ప్రణబ్

ముఖర్జీ రాసిండ్రు. కేసీఆర్ గురించి ఈరోజు చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నరు...

నాడు కేసీఆర్ మంత్రి పదవి గురించి ఆలోలించి ఉంటే నేడు తెలంగాణ వచ్చేదే కాదు.

అని స్పష్టంచేశారు.

ఎన్నోసార్లు రాజీనామా చేసినం

2004 నుంచి 2008 వరకు ఎన్నిసార్లు తెలంగాణ గురించి అడిగినా నాటి  యూపీఏ

ప్రభుత్వం ప ట్టించుకోలేదని హరీశ్ తెలిపారు. తమను అసెంబ్లీలో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఎంతో అవహేళన చేశారని వాపోయారు. 'ఇవ్వ డానికి తెలంగాణ ఏమైనా సిగరెట్టా.. బీడీనా అని హేళనగా మాట్లాడిండ్రు.. హైదరాబాద్ వెళ్లాలంటే పాస్పోర్ట్, వీసా అవసరం ఉంటదని ఆంధ్రవాళ్లను కావాలని రెచ్చగొట్టిండ్రు. తెలంగాణ ఐక్యకుండా ఆటు రాయలసీమ వాళ్లను  రెచ్చగొట్టిండ్రు.. నాడే టీఆర్ఎస్ ను అంతం చేయాలని చూసి ఎమ్మెల్యేలను తీసుకున్నరు...

ఆయినా ఆగకుండా పోరాటం చేసినం  అని గుర్తుచేశారు. 2005 లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసింది టీఆర్ఎస్ పార్టీ అని, యెన్నోసార్లు రాజీనామా చేసి ఉద్యమాలుమని, టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టంచేశారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేసిందని, అన్ని పార్టీలు తెలంగాణను వాడుకొని మోసం చేశాయని, అప్పుడే హైదరాబాద్ ఫ్రీజోన్ అని ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తుంటే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దొరకయన్న ఆవేదనతో ఉద్యమానికి, ఆ సమయంలోనే సిద్ధిపేటలో 'ఉద్యోగ గర్జన'కు కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

ఎన్ని కేసులు పెట్టినా పోరాడినం...

2009, అక్టోబర్ 12న సిద్దిపేట అంబేద్కర్ భవన్లో ఉద్యోగ గర్జన సభ సన్నాహక సమావేశం జరుగుతున్న సమయంలో అవసరమైతే తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగుతానని కేసీఆర్ చెప్పారు.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదాన్ని నాడే ఇచ్చారు. 2009, ఆక్టోబర్ 21న సిద్ధిపేటలో టీఎన్జీవో  అధ్యక్షుడు స్వామిగౌడ్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవీ ప్రసాద్ అధ్యర్యంలో లక్షలాది మంది ఉద్యోగులతో అద్భుతమైన ఉద్యోగ గర్జన సభ జరిగింది. తర్వాత  కేసీఆర్ సిద్దిపేటవేదికగా నవంబర్ 23న ఆమరణ దీక్షకు పూను కున్నరు.. ఆ క్రమంలో అల్గునూరు వద్ద కేసీఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం  జైలుకు తరలించిండ్రు' అని హరీశ్ గుర్తుచేశారు. కేసీఆర్ను ఖమ్మం తరలిస్తే ఉద్యమం చల్లారుతుందని నాటి సీఎం రోశయ్య అనుకున్నారని, కానీ ఖమ్మం  జైలు వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు,

విద్యార్థులు, నాయకులు  తరలి వచ్చారని చెప్పారు.  ఖమ్మం జైలులో కేసీఆర్తో బాటు కెప్టెన్ లక్ష్మీకాంతారావు,  నాయిని నరసింహారెడ్డి, రాజయ్య యాదవ్ లాంటివాళ్లను కూడా నిర్బంధించారని, అప్పుడు తాము రంగధాంపల్లిలో దీక్షకు పూనుకుంటేఅందర్నీ అరెస్ట్ చేసి వివిధ జైళ్లకు తరలించారని చెప్పారు. నాడు సిద్దిపేటలో ఎటు మాసినా పోలీ సులే ఉన్నారని, అయినా కొన్ని వేల మంది దీక్షాస్థలికి వచ్చారని, ఎన్ని కేసులు పెట్టినా పోరాటం కొనసాగించామని గుర్తుచేశారు. డిసెంబర్ 3 న ఖమ్మం నుంచి నిమ్స్ కు  కేసీఆర్ను తరలించారని చెప్పారు.

కేసీఆర్ దీక్షతోనే సబ్బండ వర్గాలు ఏకం

రాజకీయ ప్రక్రియతో రాష్ట్రాన్ని సాధిద్దామని కేసీఆర్ అనుకుంటే తమతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తెలంగాణను మోసం చేశాయని, అప్పుడు గాంధీ అనుసరించిన మార్గంలో నడవాలని తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని హరీశ్ చెప్పారు. నాటి కేసీఆర్ దీక్ష సబ్బండ వర్గాలను ఏకంచేసిందని, పార్టీలకతీతంగా ప్రజలు ఏకమై ఉద్యమించారని తెలిపారు. 10 రోజుల దీక్ష తర్యాత ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందారని, కాని కేసీఆర్ మాత్రం తెలంగాణ జైత్ర యాత్రా?.. కేసీఆర్ శవ యాత్రా? అని పట్టుబట్టి దీక్ష కొనసాగించారని వివరించారు. కేసీఆర్ కు ఏమైనా జరిగితే తెలంగాణ అగ్నిగుండమైతదని కేంద్ర ఇంటెలిజెన్స్ 
ద్వారా సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి చిదంబరం జయశంకర్ సార్తో

ఫోన్ లో మాట్లాడారని, అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేసిందని చెప్పారు. దీక్షా దివస్ వెనుక ఇంత  పోరాటం ఉన్నదని, నాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రముని స్పష్టంచేశారు. 'అప్పుడు తెలంగాణ అంతా పండుగలు చేసుకుంటుంటే... ఆంధ్రా నాయకులు ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండనీయకుండా చేసిండ్రు. వాళ్లు రాజీనామాలు చేస్తే డిసెంబర్ 23న

ఇచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్నది. అప్పుడు తెలంగాణ సమాజం తెలంగాణ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటే ఒక్క గులాబీ సైనికులు తప్ప ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేయలేదని తెలిపారు. బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే నేటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని  రాజేనామా చేయమంటే చేయమంటే ఢిల్లీకి వెళ్లలేదని, ఇప్పుటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాడు రాజీనామా చేయ మంటే కనీసం  జేరాక్స్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 'సీఎం రేవంత్రెడ్డి ఏనాడైనా జై

తెలంగాణ అన్నడా ?... తెలంగాణ కోసం ఎప్పుడైనా రావేనామా చేసిండా? కనీసం అమరులకు ఒక పువ్వయినా పెట్టి నివాళి అర్పించిండా?' అని నిలదీశారు. 'మాపై 350 పైగా కేసులున్నయి.. రేవంత్ మీద ఒక్క ఉద్యమ  కేసైనా ఉన్నదా? ఓటుకు నోటు కేసు మాత్రం ఉన్నది' అని దుయ్యబట్టారు. 'తెలంగాణ ఉద్యమానికి గొప్ప చరిత్ర ఉన్నది.. కానీ జ్ఞాపకాలను  గుర్తుచేసుకుంటే తెలంగాణ సాధనలో నేను సైతం అనే తృప్తి కంటే ఇంకేమి గొప్పది ఉండదు” అని తెలిపారు. "గాంధీ నాయకత్యంలో నడిచిన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న  స్వాతంత్ర్య సమరయోధుల్లా.. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమంలో మనందరిదీ అంత గొప్ప అనుభూతి.. అలాంటి తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంత గొప్పగా తీర్చిదిద్దారో గుర్తుచేసుకోవాలి అని సూచించారు.

వరంగల్ జిల్లా ఉర్సులో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలోని కీలకమైన ఘట్టాలను 

వీడియో రూపంలో ప్రదర్శించారు  తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు  అనంతరం  కేసీఆర్ భారీ కటౌట్  కు 

మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పూలు చల్లి తన  అభిమానాన్నిచాటుకున్నారు.


Asd

ChaitanyaBhagavadgita

Audio

LORD SHIVA SONGS500DVD#Link

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.? ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన. ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ ”ఓం భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి

 ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి  అర యోజన దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ”వేదవ్యాసుడు” కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా? ఏ ఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా! కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం ” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ”ఓం నమో భగవతే వాసుదేవాయ” 
ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి. 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
వేదసంస్కృతి

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల పాలనను చూసిన వారెవరికైనా రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రిని ఇప్పటికీ నియమించకపోవడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. 18 మందితో ఉండవలసిన మంత్రివర్గం 12 మందికే పరిమితమైంది. కీలకమైన హోం, విద్య, మైనారిటీ సంక్షేమం తదితర శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దనే అంటిపెట్టుకోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఏకంగా పోలీసులే నిరసనలు తెలిపే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడటం విచారకరం. కాంగ్రెస్ తరఫున గెలిచిన 65 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరూ హోంశాఖను నిర్వహించగల సమర్థుడు లేకపోవడం విడ్డూరం. యం.డి.జమీలొద్దీన్ 86862 11556 జై తెలంగాణ...జై బీఆర్ స్...జై కెసిఆర్ పదేండ్ల బీఆర్ఎస్ సర్కార్ శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖలో ఉన్నఖాళీలను భర్తీ చేసింది. ప్రతి పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలను సమకూర్చింది. అంతేకాదు, స్టేషన్ల నిర్వహణకు గాను నెలవారీగా రూ.50 వేలు మంజూరు చేసింది. ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న పోలీస్ అధికారుల ప్రమోషన్ల సమస్యను పరిష్కరించింది. తద్వారా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కార్ నేరాలను అదుపులో పెట్టేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ కోసం 'షీ' టీమ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ, 11 నెలల్లోనే తెలంగాణలో పరిస్థితులు తలకిందులయ్యాయి. మూడు లైంగికదాడులు, ఆరు హత్యలతో రాష్ట్రం చిన్నాభిన్నామవుతున్నది. అంతేకాదు, కలిసి మెలిసి జీవిస్తున్న హిందూ- ముస్లిం సోదరుల మధ్య వైరం సృష్టించే ప్రయ త్నాలు జరుగుతుండటం హేయనీయం. బక్రీద్ సందర్భంగా మెదక్ పట్టణంలో చెలరేగిన అల్లర్లు అలాంటివే. ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో జరిగిన అత్యంత హేయమైన ఘటనను ఖండించాల్సిందే. ఇలా వరుస ఘటనలు పోలీస్ శాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని పట్టపగలే హత్య చేయడం అమానుషం. 'ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా?' అని అధికార పార్టీ ఎమ్మెల్సీ రోడ్డుపై ధర్నాకు దిగడం పోలీసు శాఖలోని లోపాలను తెలియపరుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రంలో ఒకే తరహా పోలీస్ విధానాన్ని తీసుకువస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఆయన మాట తప్పడంతో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నా లు చేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు ఏకంగా యూనిఫాంతో నిరసనలు తెలపడం ఆందోళనకరం. అన్ని వసతులున్న ప్రగతిభవన్లో తాను ఉండనని భేషజాలకు పోయిన రేవంత్రెడ్డి... శాంతిభద్ర తల పరిరక్షణకు వాడవలసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను తన మీటింగ్ హాల్గా ఉపయోగించుకోవడం అత్యంత దారుణం. ఆయన చర్యల వల్ల పోలీస్ శాఖ విధులకు ఆటంకం కలుగుతున్నది. నేరాల అదుపునకు వినియోగించాల్సిన పోలీస్ శాఖను ప్రతిపక్ష నాయకులు, పౌరహక్కుల నేతలపై కక్ష సాధింపునకు వాడుతుండటంతో రాష్ట్రంలో ఖర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. పోలీస్ స్టేషన్లలో అధికార పార్టీనేతల పుట్టినరోజు వేడుకలు జరపడం, మంత్రుల బర్త్ డేలకు ఏసీపీ స్థాయి అధికారులు రోడ్లపై కేకులు కోయడం లాంటి కుత్సిత పనుల కారణంగా పోలీస్ శాఖ పలుచనవుతున్నది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తన తీరును మార్చుకోవాలి. వెంటనే హోంశాఖా మంత్రిని నియమించాలి. ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతు కలను వేధించడానికి కాకుండా నేరాల అదుపునకు మాత్రమే పోలీసు శాఖను వాడుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో పెట్టకపోతే రేవంత్రెడ్డి ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోవడం ఖాయం.

TELUGU SONGS - L MADHUSUDHAN REDDY

OUR USA VIDEOS

\

*స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం*.! 
 *స్నేహం* ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహాని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమో గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. *స్నేహం* ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. *స్నేహం ఓ మధురం..! స్నేహం ఓ వరం*..!! స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...! అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. *స్నేహితుడి కోపాన్ని..లోపాన్ని భరించడమే నిజమైన స్నేహం*..! ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది. *కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేదే స్నేహం*...! ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకోవడం స్నేహితుల మధ్య జరిగే అతి సాధారణ ప్రక్రియ. వలిశెట్టి లక్ష్మీశేఖర్ ... - 98660 35557 ....

#chandanagar#gangaram#peddacheruvu

BHAKTI SONGS VIDEOS

video

 

Newer Posts Older Posts Home