ఆ పని చేసేందుకు, తోడుగా నడిచేందుకు, మలుపులు

అందంగా త్రిప్పేందుకు, మల్లెల మాటలను తేనెల

పాటలుగా మలచి దారి బత్తెముగా ఈ పుస్తకాన్ని

అందిస్తున్నాం. ఒక మంచి మార్గగామిని తోడుగా

పంపుతున్నామని తృప్తి చెందుతున్నాం.

పాటలుగా పుస్తకంలో శబ్దంగా ఆడియోలో

శబ్దంగా, దృశ్యంగా వీడియోలో

మీ తోడు ఉండే ఈ మార్గగామి రామజోగి. మార్గంలో

మీకు ఉపకరించే ఎన్నో చిట్కాలు అతని వద్ద ఉన్నాయి.

అవే రామజోగి చిట్కాలు. అడిగితే అందుతాయి. అడుగు

ముందుకేస్తే అందాలు చిందుతాయి. ఆనందాలు విందు

చేస్తాయి.

వెళ్ళిరండి. మేమూ వస్తాము. అనంతంలో మళ్ళీ

కలుస్తాము.


Newer Posts Older Posts Home