అమ్మ నాన్నల ఇల్లు  తల్లిదండ్రులు ఉండే ఇల్లు

ప్రపంచములో.... ఆహ్వానం లేకుండా.... మనం... ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు 

"అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు ఈ ఒకే ఇల్లు ఒక్కటే... స్వతంత్రముగా.... మనమే తాళం తీసికొని.... నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు ఈ ఇల్లు.... ఒక్కటే....  ప్రేమతో నిండిన కళ్లతో...., మీరు కనిపించే వరకు.... మీ కోసం.... తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది. మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం.... మరచి పోకుండా... గుర్తు చేసే ఇల్లు. ఈ ఇంట్లో మాత్రమే.... మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ.... ఉండటం.... ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం... వెంటనే లభించే పూజ ఫలితం. మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే.... ఆ ఇంటి యజమానుల  అమ్మ నాన్నలు   మనస్సులు.... కృశించి.... గుండెలు.... గూడలుగా మారతాయి. మీరు నొప్పించినా.... వాళ్లు బాధపడతారు. ఈ ఇల్లు.... ప్రపంచాన్ని చూడటానికి...., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి... దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన  ఇల్లు. ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది... మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు.... స్థలమే లేనిది. ఇక్కడ మాత్రమే... మీరు భోజన సమయానికి తినకపోతే.... ఆ ఇంటి యజమానుల గుండెలు 

విరి గిపోతాయి మరియు బాధపడతాయి.  ఈ ఇంట్లోనే.... మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి. కారణాలు ఏవయినా కావొచ్చు....  ఈ ఇళ్లకు దూరమవుతున్నా.... పిల్లల్లారా .... ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి.... ఆలస్యం   కాకముందే... తల్లిదండ్రులతో గడుపుతూ.... మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ... అందుబాటులో ఉండే ఆవకాశం ఉన్నవారు అదృష్టవంతులు... ధన్యులు  ఓమ్ నమస్తే 

 చైతన్య గీతికలు - నవ్విన పువ్వులు

-స్వామి సుందర చైతన్యానంద

మధురమైన భావాలను

సుమధురమైన పదజాలంలో తురిమి

మృదుమధురమైన కవితా పల్లకీలో కూర్చోబెట్టి

ఊరేగించేదే కవిత్వమైతే,

దానికి ముందు మాట రాసేందుకు

కవిగా నేను ముందుకు రాలేను.

మీ ముందుకు రాలేను.

కవిత్వ మనేది కేవలం సమదర్శనమే నని

కవి ఏనాడైనా క్రాంతదర్శియే నని

నిజాలను ప్రదర్శించే యత్నంలో

ఋజువులను సృష్టించే ప్రయత్నంలో

యోజనాలను దూరాలుగా, భారాలుగా భావించక

ప్రయోజనాలనే భవ్యంగా, భావ్యంగా తలచి

జననాడిని కుదిపి

జీవనాడిని తెలిసి

జీవన స్రవంతి నిరాటంకంగా సాగేందుకు

అవరోధాలను తొలగించి

రేపటి ఆశకు తెరదించి

నిన్నటి నిరాశకు సమాధి కట్టి

నేటిని మేటిగా నిలిపేందుకు

సర్వాన్ని సర్వంలో కలిపేందుకు - 

కవిత్వమొక సాధనమైతే,

కవిగా నేను సాధకుణ్ణి.

సాధ్యాన్ని కూడా.

అవలోకించే వారికి సుందర వనాన్ని

అండ చేరే వారికి చైతన్య నిలయాన్ని

ఆస్వాదించే వారికి ఆనందాలయాన్ని.

ఈ వనంలో

విరబూసిన వేదాంత సుమాలే చైతన్య స్వరాలు

ఈ నిలయంలో

విరజిమ్మిన విజ్ఞాన సౌరభాలే చైతన్య రాగాలు

ఈ ఆలయంలో

విరివిగ వితరణ చేయబడిన ప్రసాదాలే 

చైతన్య గానాలు.ఈ పాటల్లో,

మంచి చెడుల మర్మాలున్నాయి.

ధర్మాధర్మాల సందడు లున్నాయి.

వివేకాన్ని పంచే అంగడు లున్నాయి.

పూజించేందుకు గుడు లెన్నో ఉన్నాయి.

వెల కట్టేందుకు యతిప్రాస లున్నాయి.

వెల కట్ట లేని యతి శ్వాస లున్నాయి.

మాసిపోని మాట లున్నాయి.

హద్దులు దాటిన పదా లున్నాయి.

తెల్లని కాగితాలపై తేలియాడే ఈ నల్లని రాతలు

కాలం చెల్లే రాతలు కావు. కాలంలో 

చెల్లని రాతలూ కావు.

ఇవి జ్ఞానక్షీరాన్ని అందించే మాతలు

తప్పకుండా తుడుస్తాయి మన తల రాతలు.

ఇందులో,

కవిలేడు. కవిత్వ ముంది.

గాయకుడు లేడు. గాన ముంది.

వేదాంతి లేడు. వేదాంత ముంది.

కర్త లేకుండా సాగిన కర్మ ఇది. యజ్ఞమిది. 

జ్ఞానయజ్ఞ మిది.

వసంతాన్ని చూచేందుకు కళ్ళు సరిపోతాయి.

అనుభవించేందుకు హృదయ ముండాలి.

సున్నితమైన ఒక హృదయం ఒలికించిన

కవితా సుధలను పట్టి నిలుపుకొనేందుకు

సరియైన పాత్ర మరొక సున్నిత హృదయమే.

హృదయేశుని రస మందిరమే.

సరసమయ నవరస మందిరమే.

సమరస మందిరమే.

స్వామి

కలలను కరిగించే

కవితా ఉషస్సులో

ప్రార్థనే ప్రాణవాయువుగా పొందిన

ఓ కిరణం

స్వామి సుందరచైతన్యానంద


పశువులు అంటే బాపుకు ప్రాణం చిటుకుల మైసారెడ్డి 9490524724 పశువులు అంటే ఆయనకు ప్రాణం. చెట్టు, చేమ అంటే ఆయనకు శ్వాస, మట్టి తోనే అయన జీవితం. తూరుపు తెలవారుతుండగానే వేపపుల్లేసుకొని ఇంటి నుంచి ఎల్లిండంటే, పొద్దుగూకినంకనే ఇంటి ముఖం చూస్తుండే. ఊరంటే ప్రేమ. ఊరోళ్లకు ఆత్మీయుడు. ఆపదొస్తే అందరికీ అండ. ఆయనే మా బాపు చిటుకుల నర్సారెడ్డి. అందరికి ఆత్మబంధువు బర్లకాడి నర్సయ్య. ఉద్యమాల గడ్డ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి మాది. ఊర్లోని దాదాపు 200 బర్ల కాపరి, వానొచ్చినా, ఎండొచ్చినా పొద్దూక చెట్టు, పుట్ట పట్టుకొని తిరుగుతూ బర్లు కాస్తుండే. పొద్దుగూకిందంటే ఎవరి ఇంటి బర్లు వాళ్ళింటికి తోలేటోడు. బాపు ఇంటికి రాంగానే కాళ్లుచేతులు కడుక్కొని పెద్ద పీట మీద ఒరుగు తుండే. రాత్రి ఎనిమిది కాగానే, తిని పడుకునుడు. తెల్లవారుతుండగానే బర్ల మంద మఠం బలిజోల్ల చింత చెట్ల దగ్గరకు పోవు. అన్ని బర్లు రాగానే చెరువు, పేరండ్లు, పొలాల దిక్కు మేతకు తోల్కపోపు, 12 అయిందంటే మళ్ళీ బర్లన్నీ మందకు వచ్చు. అప్పటికే అమ్మ సద్ది తీసుకుని వచ్చు. సద్దితిని ఓ గంట చెట్టు దగ్గర ఒరుగుతుండె. పగలు రెండు న్నర మూడు ప్రాంతంలో మళ్లీ బర్లను మేతకు తీస్కపోవు. మంద దగ్గర బర్ల పెండను అమ్మ. నేను కుప్పేసి ఇంటికెళ్లేది. బాపు బర్లను ఊరు పొలిమేర లోట్లమర్రి, కాశిమ్ చెరువు, పెద్ద చెరువు, ఎల సముద్రం కుంట, పెద్ద మామిడి తోట దిక్కు, పెద్ద చెప్యాల, రుద్రారం వీరారెడ్డిపల్లి, గాజులపల్లి పొలిమేర దాకా తిప్పుకొంటు చీకటి పడగానే ఊర్లకుపంపు. అప్పటికే పంచాయతీ దగ్గర చౌరస్తాలో ఉన్న బర్ల యజమానులు తమ బర్లు రాగానే ఇంటికి తీసుకెల్దురు. ఇట్ల బాపు 25 యేండ్లు బర్లు కాసిండు. ఆయన కష్టం ఎవరికీ రావద్దు. పశువులను పూజించే సంస్కృతి తెలంగాణకు సంక్రాంతి పండుగ ప్రత్యేకం. పనిముట్లు, పశువులను పూజించే వ్యవసాయ సంస్కృతి, కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దులను కడిగి కొమ్ములకు నూనె రాసి ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడ్తారు. సాయంకాలం పశువుల మీద మంచి నీటిని చిలకరిస్తరు. పశులు సాయంకాలం ఇంటి వస్తే లక్ష్మి వచ్చినట్లు ఆనందపడ్డారు. ఆ రోజు పశులకు పండుగ పూట వండిన నైవేద్యం పెడ్తారు. పాకలను శుభ్రం చేసి అక్కడే భోజనం చేస్తరు. శాకాహారులైతే బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు అన్నీ ఇంటికి తీసుకువెళ్లి వండుకుంటరు. వ్యవసాయదారుడికి పశువులే ధనం. పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతగా వాటికి కొత్త బియ్యంతో పరమాన్నం వండి పెడుతరు. 40 యేండ్ల కిందట గత్తర వచ్చి జనం ఎంతో ఇబ్బందులు పడ్డారు. నీళ్లు లేక, ఎవసం నడవక, ఏదైనా పని చేసుకుందాం అంటే ఎన్నో కష్టాలు పడ్డ రోజులవి. అందులో మా బాపు జీవితం కూడా కష్టాల కడలి. ఎంత బాదొచ్చినా తన మనసులో పెట్టుకొను. పిల్లలు ఇబ్బందులు పడ్తరని మాకు చెప్పక పోవు. కరువు కాలంలో బాయిలు, సడాకులు తవ్వారు బాపు, అమ్మ, అప్పుడు మా అక్క, అన్న, నేను, చెల్లె చిన్నోళ్లం. గుత్త పట్టు కుని బావులు తొవ్విండు. ఉన్నది ఒక ఎకరం. వానలు పడ్డప్పుడు తప్పు ఎప్పుడూ పంట పండింది లేదు. కాంచెరువు (కాశీమ్ చెరువు) నిండిన్నాడు ఇంత పంట పండేది. బాయిలో నీళ్లు లేకపోవు. కాంచెరువుతో బాయిలోకి ఇంత ఊట వచ్చు. బాయిలో జెర నీళ్లు ఊరగానే బాపు, అమ్మ యాతమేసి ఎత్తి పోద్దురు. బాయిల నీళ్లు లేకపోతే బర్ల కాస్తూ ఆర్నెల్లకు ఒక్కసారి వచ్చే డబ్బులతో జీవితం నెట్టుకొచ్చేది. బాపుకు చాతకాకుంటే అమ్మ, నేను బర్లను కాస్తుంటిమి. కాట్రావుల (పశువుల పండుగ) సంక్రాంతి అంటే బాపు చేసే కాట్రావుల (పశువుల)పండుగ యాదికొస్తది. సంక్రాంతికి వారం ముందు ఈ పండుగ చేసుకుందురు. ఈ పండుగ రోజు ఇంటిలో వాళ్ళం అందరం బియ్యం, కూరగాయలు, పప్పుదినుసులు, ఇంత మాంసాహారం తీసుకుని బాపు ఎంబడి బర్లకాడికి పొదుము. పెద్ద చెరువులోని బంకమట్టి తెచ్చి పశువుల బొమ్మలు చేద్దుము. ఓ చెట్టు కింద పందిరి వేసి మామిడి తోరణాలు, బంతి పూల దండలు కట్టి మట్టితో చేసిన పశువులను అందులో ఉంచి వాటికి బొట్టు. పసుపు నూనె రాసి.. దీపం ముట్టించి.. అమ్మ చేసిన పరమాన్నం పెడుదుము. పండుగ నాడు బాపు బర్లను, దూడలను అన్నింటినీ పెద్ద చెరువులో మంచిగా కడుగు. వాటికి బొట్లు పెట్టి కొమ్ములకు పసుపు నూనె రాసి పసుపు కుంకుమలతో అరచేతి ముద్రలు వాటిపై వేద్దుము. మామిడి తోరణాల కింది నుంచి బర్ల మందను డ్డ దాటిద్దుము. బాపు చనిపోయి 21 యేండ్లు అవుతున్నది. సంక్రాంతి వచ్చిందంటే బాపు చేసే కాట్రావుల పండుగా యాదికొస్తది. 2020 నవంబర్ లో అమ్మ కాలం చేసింది. బాపు లేనప్పుడు అమ్మతోని కల్సి సంక్రాంతి పండుగ చేసుకునేది. ఇప్పుడు బాపు. అమ్మ కూడా లేరు. ఆ వెలితి. జీవం అంత గుంజేసినట్లు ఉంది. 2023 సెప్టెంబర్ లో నా బిడ్డ పెండ్లి చేసిన, బాపు, అమ్మ ఉంటే మనవరాలి పెండ్లి చూసి ఎంతో సంతోషపడుదురు. కానీ, బాపు అమ్మ దీవెనలు నా బిడ్డకు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్ కోసం తండ్లటా. ఎవుసం పండుగజేసి తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో సంక్రాంతి సంబరంగా ఉండేది. సంక్రాంతి శోభకు మన తెలంగాణ పెద్ద బాపు కేసీఆర్ రైతుబంధు పండుగ సంబురాలు ఉండేవి. పల్లెలన్నీ పండుగ వాతావరణంలో కోలాహలంగా కనిపించేవి. దేశంలో ఇటువంటి పథకం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాల మాగాణి పచ్చని సిరుల పంటలు పండుతున్నాయి. 60 యేండ్ల ఉమ్మడి రాష్ట్రపాలనలో రైతు బతుకు ఎట్లుండే. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నరు. నాటి రైతు కాట్రావుల పండుగ గత తొమ్మిదిన్నర ఏండ్లు రైతు బంధు పండుగతో సంక్రాంతి అంబరాన్ని అంటింది. తెలంగాణ బిడ్డల బాగు కోసం నాడు కేసీఆర్ ఒక తండ్రిలాగ భవిష్యత్ కు భరోసా ఇచ్చారు. రాష్ట్రం తెచ్చిన ఉద్యమ నాయకుడే రాష్ట్ర పరిపాలకుడిగా 'బాపు'లా రాష్టాన్ని అభివృద్ధి సంక్షేమంలో ప్రగతి పథంలో ముందుకు నడిపించారు కేసీఆర్ బాపు. కేసీఆర్ బాపు నాయకత్వం లో తెలంగాణ ఎవసం పండుగలా ఉండేది. కేసీఆర్ బాపు రైతన్నకు వెన్నెముక అయి నిలిచిండు. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, సిద్దిపేట)

 నమస్తే తెలంగాణ

ప్రతీకారం కోసమే ప్రమాణమా?.......డాక్టర్ క్రిశాంక్ మన్నె

ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టేటప్పుడు రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తానని రాజ్యాంగం సాక్షిగా, దైవసాక్షిగా ప్రమాణం చేస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలానే చేశాడు. కానీ, ఈ ఒక్క సంవత్సరంలో తన తీరు చూస్తే పాలన లేదు కానీ, కేవలం పగ, ప్రతీకారం మాత్రమే కనిపిస్తున్నది. మొదట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా బురద జల్లడానికి ఒక కమిషన్ ఏర్పాటుచేశారు. ఆశ్చర్యకర విషయం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బీజేపీ సిద్ధాంతకర్తను ఆ కమిషను చైర్మన్ గా నియమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే విద్యుత్తు సమస్యను పరిష్కరించినందుకు కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ కమిషన్ చైర్మన్ మీడియా పబ్లిసిటీ కోసం బురదజల్లే ప్రయత్నం చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఆయన తీరును తప్పుపడుతూ కమిషన్ చైర్మను పదవి నుంచి తొలగించింది. రేవంత్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు ఇది మొదటి చెంపపెట్టు.

2024లో ఇచ్చిన గ్యారెంటీలను పక్కన పెట్టి, చెప్పిన 420 హామీలను మరిచి కేవలం కేసులు, బెదిరింపులు, దాడులు, జైలు, ఇదే అజెండాపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల మెట్రోకు ఆర్ధిక నష్టాలు వచ్చాయని దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ సీఎఫ్వో వ్యాఖ్యానిస్తే ఆయనను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం రేవంత్ ఒక జాతీయ చానల్లో చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి కీలక అంశాలు ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చించకుండా కీలక సమయాన్ని సినీపరిశ్రమ, సినీ నటులను టార్గెట్ చేయడానికి ఉపయోగించారు. కొడంగల్ మహిళలపై అశ్లీలదాడులు, రైతులకు బేడీలు వేసి జైలుపాలు. చేయడం, సామాజిక మాధ్యమా ల్లో ప్రభుత్వ వైఫల్యాలను విద్యుత్తు కోతలను ప్రశ్నిస్తున్న పౌరులపై అక్రమ కేసులు వేయ డం, ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే ఫొటోలు దిగుతూ ప్రచారం చేసుకుంటున్నారని నిలదీసిన యువతపై లాఠీచార్జి చేయడం, పోలీస్ బెటాలియన్ల కుటుంబాలను రోడ్డుపైకి లాగడం, న్యాయం చేయాలనడిగిన వారిని ఉద్యోగం నుంచి తొలగించడం, ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టే పాలన కిందకే వస్తాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎప్పుడూ రేవంత్ అభద్రతాభావంతో వ్యక్తిగతంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. రేవంత్ నోటి దురుసు కొండా సురేఖకు శాపంగా మారి జాతీయస్థాయిలో తీవ్రవిమర్శను ఎదుర్కొని అబాసుపాలైంది. ఆమె చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు గతంలో రేవంత్ బీజం వేసినవే అని సమాజంలోని పౌరులు వ్యాఖ్యానించారు. అయినా, రేవంత్ ఆగలేదు, నేరుగా సీఎం కార్యాలయం నుంచి కేటీఆర్ కుటుంబసభ్యుల విందులో మాజీ మంత్రి పాల్గొనకపోయినా, ఆయనపై కుట్ర చేయడానికి దాడిచేశారు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నుంచి రేవంత్ ఒక అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేపించాడు, కేటీఆర్ రాజకీయాలు వదిలి అమెరికాకు పారిపోతాడని. కానీ, కేటీఆర్ రైతుల కోసం, కొడంగల్ గిరిజన మహిళల కోసం, ఆటో డ్రైవర్ల కోసం, బుల్డోజర్లతో కూల్చేసిన పేద, మధ్య తరగతి బాధితుల కోసం బాధిత పోలీస్ బెటాలియన్ల కోసం, నేతన్నల కోసం విరామం లేకుండా పోరాడారు, పోరాడుతున్నారు కూడా, ఇది తట్టుకో లేని రేవంత్ ఎలాగైనా కేటీఆర్ను ఆపడానికే కుట్రపూరితంగా 'ఫార్ములా ఈ' కారు రేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు కంకణం కట్టుకున్నారు. 

కానీ, అసలు కేసు లేని విషయంలో ఇప్పుడు రేవంత్ను వెనుకేసుకోలేక సీనియర్ కాంగ్రెస్ మంత్రులు మౌనంగా ఉంటున్నారు. రేవంత్ చుట్టూ తిరిగే గ్యాంగ్ తన్లాడుతూ మీడియా ముందు జోకర్లు అవుతున్నారు. తొట్టి మంత్రిగా కేటీఆర్ చేసిన కృషి వల్లే ఆమెజాన్ సంస్థ అమెరికా బయట తన అతిపెద్ద కార్యాలయ క్యాంపస్ ను తెలంగాణ రాష్ట్రంలో నిర్మించింది. ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటుచేసింది.

ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాలతోనే కుదిరింది. 'కిటెక్స్' అనే అతిపెద్ద పిల్లల వస్త్రాల సంస్థ కేరళ నుంచి ఇతర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ప్రకటించినప్పుడు, దేశంలోని పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి, కేటీఆర్ హెలికాప్టర్ పంపించి ఆయనను తెలంగాణ రాష్ట్రానికి రప్పించి హుటాహుటిన వరంగల్ లో పెట్టుబడి పెట్టే విధంగా అధికారిక ప్రకటన చేయించి, దానికి సంబంధించిన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ హెలికాప్టర్ ఎలా పంపించారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసు వేస్తుందా ఏమిటి? ఫార్ములా ఈ' అనే ప్రయత్నం కేవలం ఒక రేసు కోసమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు గాను నాటి కేసీఆర్ ప్రభుత్వం నూతన విధానాలను అవలంబించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ బీవైడీలాంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నది. 

అమర్ రాజా బ్యాటరీ సంస్థ వేల కోట్ల పెట్టుబడులతో పాటు ఎలాన్ మస్క చెందిన టెస్లా సంస్థను కూడా హైదరాబాద్కు తీసుకురావాలనే దూరదృష్టితో 190 దేశాల్లో అభిమానులుండే ఫార్ములా ఈ రేసును మొట్టమొదటిసారి మన నగరంలో నిర్వహించింది. ఈ పోటీలకు అంతర్జాతీయ క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, క్రీడాభిమానులు, ఆఖరికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కూడా హాజరై తిలకిం చారు. పగతో, పచ్చకామర్లతో ఉన్న రేవంత్ మెప్పు పొందడానికి కొందరు అధికారులు ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని చెవులు కొరికేసరికి రేవంత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకే, కేటీఆర్ను ఇరికించాలని చూస్తున్నాడు. అంతేకాదు, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కేసు వేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి చిక్కులు ఉండవద్దని గవర్నర్ ఆమోదం కోసం అర్జీ పెట్టుకున్నాడు. అది ఆలస్యమవుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డిని కూడా కలిశారు. ఆ తర్వాత 24 గంటల్లోపే ఏం అద్భుతం జరిగిందో కానీ, నెల నుంచి కదలని గవర్నర్ ఆమోదం వెంటనే వచ్చేసింది. ఆ తర్వాత హుటాహుటిన ఏసీబీ ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత 24 గంటల్లోనే  కేంద్ర విచారణ సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. రేవంత్ తన సొంత తమ్ముడి కంపెనీతో అమెరికాలో వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకుంటే విచారణ లేదు. రేవంత్ తన సొంత బావమరిది కంపెనీకి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద రూ.1.37 కోట్ల కాంట్రాక్టు ఇస్తే విచారణ లేదు, రేవంత్ తన అల్లుడి కోసం మెడికవర్ మ్యాక్స్బన్ ఫార్మా కంపెనీలను ప్రమోట్ చేసినా విచారణ లేదు. రేవంత్ వాడిన ల్యాండ్ క్రూజర్ కోట్ల రూపాయల విలువ గల టీఎస్ 07 ఎఫ్ఎఫ్ 0009 వాహనం ఏ కంపెనీకి చెందిందో ఆ కంపెనీకి వందల కోట్ల కాంట్రాక్టులు దక్కడం, దానికి రేవంత్ కు సంబంధం ఏమిటో విచారణ లేదు. కానీ, హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టిన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కేటీఆర్ను నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారు. కేటీఆర్ ఖుల్లంఖుల్లా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తానే తీసుకున్నట్టు బహిరంగంగా మీడియా ముందు, అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రకటించారు. చర్చకు సిద్ధమని ఆహ్వానించారు. కానీ, రేవంత్ ధైర్యం చేయలేకపోయాడు. మొదట డబ్బు ఎక్కడుందో అని ప్రచారం మొదలు పెట్టి, ఆ తర్వాత అవినీతి అని తిప్పి, ఇప్పుడు అవినీతి నిరూపించలేక నియమ నిబంధనల బేఖాతరు అని ప్రచారం చేసి, ఆఖరికి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాడికి వచ్చారు. గొప్పగా పని చేసినందుకు ఒక మంత్రిని జైలులో పెడితే రానున్న తరాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురువుతాయి. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేయడానికి రాజకీయ నాయకులు భయపడతారు. ప్రభుత్వాలు మారిన తర్వాత కక్షపూరితంగా కేసులను సృష్టించి జైల్లో వేస్తే ఒక కొత్త ధోరణికి తెరలేపినట్టు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు చూశారు. రేవంత్ నోట్ల సంచితో అడ్డంగా దొరికినప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి డబ్బులతో రేవంత్ దొరికితే దాన్ని టార్గెట్ చేసినట్టు చూడలేం. అదే కాంగ్రెస్ నాయకులు ఉత్తమకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎన్నో వ్యాపారాలు ఉన్న వివేక్, దామోదర రాజనర్సింహ, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ టార్గెట్ చేయలేదు. ఏ నాడూ గీత దాటి సోనియా గాంధీని విమర్శించలేదు. కానీ, రేవంత్ అన్ని హద్దులు మీరాడు. వ్యక్తిగత దూషణ చేశాడు. ఇప్పటికీ అసభ్యకరంగా చేస్తూనే ఉన్నాడు… అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తూ కేసీఆర్  ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భట్టి నియోజకవర్గాన్ని దళితబంధు మోడల్ నియోజకవర్గంగా తీసుకొని సంక్షేమ పథకాన్ని అందించారు. అందరికీ తెలియని విషయం ఏమంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రేవంత్ కుటుంబ సభ్యులకు చెందిన భూపాల్ ఇన్ఫ్రా లాంటి కంపెనీలకు కోట్ల రూపాయల ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సామాన్య ప్రజలు రేవంత్ చేస్తున్నరాజకీయాలను ఆంధ్ర ప్రతీకార రాజకీయాలతో పోలుస్తున్నారు. నేరం చేయని కేటీఆర్ను జైల్లో పెడితే మొదటిసారి కేవలం స్వార్థం, సైకో పైశాచికానందం పొందడానికే ఒక నాయకుడిని జైల్లో పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో రేపు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. 

ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పార్టీ కార్యాలయాల్లో కేసీఆర్ చిత్రపటాన్ని అగౌరవంగా ధ్వంసం చేస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తే నష్టం ఎవరికి? శాంతి భద్రతలు కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి అల్లరి మూకలకు రక్షణ ఇస్తే, సాక్షాత్తు సీఎం రేవంత్ తన ఉపన్యాసాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, నాయకులను జైల్లో పెడితే, వ్యాపారవేత్తలను బెదిరిస్తే, కళాకారులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తే, ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయిస్తే రాష్ట్ర అభివృద్ధికి భారీ ఇబ్బందులు వస్తాయి. రానున్న నాలుగేండ్ల దారుణమైన రేవంత్ ప్రభుత్వంలో మన రాష్ట్రానికి ఇంకెంత అపకీర్తి వస్తుందో, ఆలోచిస్తేనే బాధ కలుగుతున్నది.   (వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్)


 ఇదీ.. రేవంత్ మార్క్ ఎమర్జెన్సీ….గోసుల శ్రీనివాస్ యాదవ్  98498 16817  నమస్తే తెలంగాణ


గతం వర్తమానాన్ని, వర్తమానం భవిష్యత్తును నిర్దేశిస్తుంది అంటారు. నేడు తెలంగాణ 

రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఎమర్జెన్సీ నడుస్తున్నది. గతంలో ఇందిరాగాంధీ

ఎమర్జెన్సీని చూసిన ఈ దేశం నాటి నియంతృత్వం, అరాచకత్వంపై  పుంఖానుపుంఖాలుగా చర్చించుకుంటున్నది. వామ్మో.. ఇందిరమ్మ ఇంత దౌర్జన్యమా అనే వేల పుస్తకాలు, లక్షల రచనలు అచ్చయి, నాటి చరిత్రను ఇప్పటికీ సజీవంగా కండ్ల ముందు కదలాడేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తమన్న రోజే ఇక్కడి బుద్ధి జీవులు ఇందిరమ్మ రాజ్యపు అరాచకాలు, అమానవీయ ఘటనలను గుర్తు చేసుకున్నారు. కానీ, అదే పార్టీలో కొందరు మార్పు. ప్రజాపాలన అని రకరకాల గజకర్ణ, గోకర్ణ విద్యలతో పాటు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు.

అధికారంలోకి వస్తూనే ఆరు గ్యారెంటీలతో పాటు స్వేచ్ఛా స్వాతంత్య్రం  అనే

ఏడో గ్యారెంటీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తామని చెప్పారు. నిజానికి, ఆ ఆరు గ్యారెంటీలను పాతరేసి ఆయన ఇప్పుడు ఏదో గ్యారంటీపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్టున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తలదన్నే తరహాలో తన నిరంకుశ,

నియంతృత్వ, అపరిపక్వ పాలనతో నయా ఎమర్జెన్సీ అనే పాలసీని తు.చ. తప్పకుండా అమలు జరిపిస్తున్నరు. వ్యక్తిగత కక్షలు, ప్రతీకారం ఉండదని ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో ఆయన ఆలోచన పోకడలు చూసి తెలంగాణ సమాజం నివ్వెరబోతున్నది. ప్రధాన ప్రతిపక్ష నేతలను వేటాడి వెంటాడి కేసుల్లో ఇరికి స్తుండటం ఒక ఎత్తయితే, నక్సలైట్లపై కాల్పులు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, ఆకలి చావులు, విద్యార్థులు విషాహార మారణ హోమాలపై, నిత్యం తల్లడిల్లుతున్న తెలంగాణపై ప్రశ్నిస్తున్న ప్రజాస్వామికవాదులపై కేసులు. నిర్బంధపు ఉచ్చు మరో ఎత్తులా పరిణమిస్తున్నది.

ప్రధానంగా అధికారంలోకి వచ్చేముందు మ్యానిఫెస్టో ద్వారా ఆరు గ్యారెంటీలు, 120 హామీలపై మాట్లాడే ప్రతీ గొంతుకను ఏదో గ్యారెంటీని అడ్డుపెట్టి మరీ కోసేస్తున్నారు. ప్రగతిభవన్ పేరును ప్రజాభవన్ మార్చి గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం నేడు ప్రజాభవన్లోకి అందరినీ స్వేచ్ఛగా అనుమతిస్తున్నదా?

ఓ జిల్లా నుంచి ఎవ్వరైనా సచివాలయం వస్తే పోలీస్ నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా అనుమతించే పరిస్థితి ఉన్నదా..? సచివాలయం 6వ అంతస్థులోకి కంచెలెందుకే సారు. సీఎంను ఓ సామాన్యుడు గానీ, ఎమ్మెల్యే గానీ అనుమతి లేకుండా కలిసే  పరిస్థితి ఉన్నదా... ఇలాంటి స్వీయ ప్రశ్నలకు రేవంత్రెడ్డి నుంచి సమాధానం

రావాలి. ధర్నా చౌక్ నిషేధం ఎత్తివేశామనీ, అదే ఓ పెద్ద విశాలమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని నమ్మబలుకుతున్నారు. కానీ, నిజానికి ధర్నా చౌక్ ఎప్పుడూ నిషేధంలో లేదు. స్వయంగా సీఎం హోదాలో కేంద్రంపై కేసీఆర్ నిరసనకు

దిగింది ధర్నా చౌక్ వద్దే. కేసీఆర్ సర్కార్లో నిత్యం ధర్నాచౌక్ ఓ ప్రజాస్వామ్య వేదికగా ఉండేది. కానీ, ఇప్పుడు ఏడాదిలో పోలీసు రాజ్యమే నడుస్తున్నది. ఇవాళ ధర్నాచౌక్ లో  ధర్నాలు చేద్దామని దరఖాస్తు చేస్తే సవాలక్ష ఆంక్షలు, ఇటీవల బీసీల కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కోసం దరఖాస్తు చేస్తే కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితి. పౌరహక్కుల సంఘం యాభై ఏండ్ల మహాసభల సందర్భంగా గత మార్చిలో ఊరేగింపు జరపడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జనవరి 13న అంతర్జాతీయ పాలపాలస్తీనా సంఘీభావ ప్రదర్శన రోజున, ట్యాంక్ బండ్

మీద మఖ్దూమ్ విగ్రహం దగ్గర ప్రదర్శన జరుప బోతే విపరీతంగా పోలీసులను మోహరించి విద్యార్థి యువజనులను అరెస్టు చేశారు. భువనగిరిలో హైస్కూలు విద్యార్థినులు భవ్య, వైష్ణవిల అనుమానాస్పద మరణాలపై సరైన దర్యాప్తు

కోరుతూ చైతన్య మహిళా సంఘం ధర్నా తలపెడితే పోలీసులు దాన్ని విచ్ఛిన్నం చేశారు. హైదరాబాద్ గాంధీనగర్ లో గ్రూపు పరీక్షలకు తయారవుతున్న ఒక నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే, అక్కడ చేరిన నిరుద్యోగులు ఆందోకనకు దిగకుండా చెదరగొట్టారు. హైదరాబాద్ శివార్లలో ఒక చర్చిని మతోన్మాదులు ధ్వంసం

చేసిన ఘటనలో సమస్యను పరిష్కరించకపోగా, తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన బాధితులనే అడ్డుకున్నారు. ఏడాదిలో ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టుల మీద దాడుల వార్తలు వస్తూనే ఉన్నాయి. శాసనసభలో మీడియా పాయింట్ దగ్గర ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసుస్టేషన్లో గిరిజన యువకుడి లాకప్ డెత్ జరిగింది. ఏడాదిలోనే మంత్రి సీతక్క ఇలాఖాలోనే మూడు ఎన్ కాంటర్లు జరిగాయి. ఇక ఎస్ఐఏ,  ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, పొరుగు రాష్ట్రాల పోలీసులు సోదాలు, దాడులు, మనుషులను ఎత్తుకుపోవడం నిత్యకృత్యమవుతున్నాయి. జైలు నిర్బంధంలో ఉన్న లగచర్ల రైతులకు బేడీలు, ఫార్మాకంపెనీల పేరుతో భూములను లాక్కోవడం వంటి ఘటనలూ సహజమైపోతున్నాయి.

ఇక తన పాలనలో రాష్ట్రం పూర్తిగా నేరయమై పోయిందనడానికి తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్రెడ్డి విడుదల చేసి వార్షిక క్రైం రేట్ లెక్క.లే నిదర్శనం. 2,945 అత్యాచారాలు, 241 హత్యలు, 379 ఆత్మహత్యలతో ఓవరాల్ క్రైంరేటు దాదాపు 10 % పెరిగింది. గతేడాది 2,13, 121 కేసులు నమోదైతే, 2024లో 2,34, 158 కేసులు నమోదయ్యాయి. ఇక సైబర్ క్రైం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. వీటన్నిం టిపై అజమాయిషీగా నిర్వహించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి వ్యవహరిస్తూ కేవలం ప్రధాన ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నది.

పదే పదే ఇందిరమ్మ రాజ్యం అంటున్న ఈ సర్కారులో పోలీస్ రాజ్యమే నడుస్తున్నది. ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్ టార్గెట్ చేసి కేసుల్లో ఇరికిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై   10 కేసులు నమోదు చేసి అరెస్ట్ సాకుల కోసం అనేక రకాలుగా రంధ్రాన్వేషణ సాగిస్తున్నారు. కేసీఆర్పై రాజకీయ కక్ష పెంచుకొని రాజకీయాలను పూర్తిగా ప్రతీకారాత్మకంగా మార్చేయడం గమనార్హం. బీఆర్ఎస్ సీనియర్ నేత, ఫైర్

బ్రాండ్ హరీశ్ రావు గొంతు నొక్కే ప్రయత్నం అడుగడుగునా జరుగుతున్నది. 

ఆయనపై ఆరు కేసులు నమోదు చేసి రాక్షసానందం పొందుతున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడి చేయడమే కాకుండా, ఎక్కడ ఏ ఘటన జరిగినా,

ఎవ్వరే కేసుల్లో ఇరుకున్నా హరీశనే రోజూ గృహ నిర్బంధం చేయడం పరిపాటిగా మారింది. సీఎం రేవంత్ తన పాలనా కాలమంతా కేటీఆర్ అరెస్ట్, హరీశిపై కేసులు, మాజీ సీఎం కేసీఆర్ పై విచారణలకే కేటాయిస్తుండటం తెలంగాణ సమాజం

నిశితంగా గమనిస్తున్నది. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి ఉద్యమకారులపై కావాలని కేసులు పెట్టి సెలవు రోజుల్లో అరెస్టు చేస్తూ, సీఎం వికృత ఆనందాన్ని పొందుతున్నారు.

ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదనడానికి అనేక ఉదాహరణలున్నాయి. రైతులను ఈ సర్కారు మోసం చేసిందనదానికి రైతు రుణమాఫీ, రైతు భరో సాలే ప్రత్యక్ష ఉదాహరణలు,

కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు దేశవ్యాప్తంగా ఒక రోల్ మాడల్ గా నిలిచింది. దీని పేరును రైతు భరోసాగా మార్చి ఏడాదికి 10 వేలు కాకుండా 15 వేలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలందరూ ప్రజల దగ్గరకు వెళ్లి పదే పదే చెప్పారు. వరంగల్ లో జరిపిన భారీ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ పేరిట 15 వేలు

ఇస్తామని రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్గాంధీ మాత్రమే కాదు, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే వంటివారు కూడా. పాల్గొన్న ప్రతి సభలో రూ.15 వేలు ఇస్తామని చెప్తూనే వచ్చారు.

ఇక ప్రగల్భాల రేవంత్ రెడ్డి అయితే  కేసీఆర్ ఇచ్చే ముష్టి 10 వేలు ఎందుకు? మా ప్రభుత్వం రాగానే ఎకరాకు 15 వేలు ఇస్తామని ఊరూరా తిరిగారు, రాహుల్ గాంధీ

సహా కాంగ్రెస్ అగ్రనేతలందరూ చెప్తున్నారు కాబట్టి అమలు చేస్తారని ప్రజలు అమాయకంగా వీరి మాటలు. నమ్మారు. దగా చేయటం కాంగ్రెస్ డీఎన్ఏలో ఉన్నదనే విషయాన్ని తెలంగాణ రైతాంగం మర్చిపోయింది.

ఎన్నికలు అయిన తర్వాత వాయిదాల పర్వం ప్రారంభమైంది. సోనియాగాంధీ పుట్టినరోజుకు కానుకగా ఇస్తామన్నారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇస్తామన్నారు. వాయిదాలు వేసి వేసి ఇప్పుడు రూ.15వేలు కాదు. రూ. 12 వేలు మాత్రమే ఇస్తామని రేవంత్రెడ్డి సర్కారు నిసిగ్గుగా ప్రకటించింది. అది కూడా వ్యవసాయయోగ్యమైన భూములకు అని కొందరు మంత్రులు బహిరంగంగా

చెప్తున్నారు. కానీ, వ్యవసాయ యోగ్యమైన భూములంటే ఏమిటో చెప్పటం లేదు. 

అంతే కాదు. సాధారణంగా రైతులకు వానకాలం నాట్లకు పెట్టుబడులు అవసరమవుతాయి. ఆ సమయంలో ప్రభుత్వం భరోసా ఇవ్వకుండా

రూ.11 వేల కోట్లు ఎగ్గొట్టింది. ఇప్పుడు యాసంగిలో షరతులతో కూడిన పంపిణీ 

చేస్తానంటున్నది. తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి బయటపడే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా కాంగ్రెస్ పోకడలపై యుద్ధానికి సిద్ధంకావాలి. తెలంగాణ మట్టి బిడ్డలకు తెలంగాణ

తల్లి ఉగ్గుపాలతోనే ప్రశ్నించడం నేర్పింది. ప్రపంచంలో ఎన్నో విప్లవ సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుంది నేటికీ తెలంగాణ బిడ్డలే. వర్గ పోరాటమైనా, వర్ణ పోరాటమైనా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం ప్రపంచంలోనే పోరాటం చేసిన చరిత్ర తెలంగాణకున్నది. ఇట్లా కొట్లాడిన తెలంగాణ బిడ్డలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తా, ప్రశ్నిస్తే జైలుకు..పంపిస్తా అంటే తెలంగాణ సమాజం ఎన్నిసార్లు జైలుకెళ్లడానికైనా, ఎన్నిసార్లు కేసులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నదని 

తెలుసుకోవాలి తెలంగాణ సర్కారు పెద్దలు. ప్రజాపరిపాలన అని చెప్పి ఈ రోజు తెలంగాణలో రేవంత్ ఎమర్జెన్సీ నడుస్తున్నది. నాడు దేశంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ, నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ.. బుద్ధిజీవులు, శ్రమజీవులు, శ్రామికులు, విద్యార్థులు, యువకులు ప్రశ్నించాల్సిన మోకా వచ్చింది.

ప్రజల కోసం.. ప్రజాస్వామ్యం కోసం..ప్రశ్నిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం....

(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)


 తెలంగాణ బిడ్డలకు తెలియజేయునది ఏమనగా

ఈ వీడియోలో KTR గారు మనందరము ఈ 

సంవత్సరం ఏమి చెయ్యాలో వివరముగా తెలిపినారు

మనందరము ఈ వీడియోను శ్రద్ధగా చూచి,  

విషయాలను అర్థంచేసుకొని ప్రతి ఒక్క తెలంగాణ 

బిడ్డకు అర్థమయేటట్లుగా వివరించి, కొట్లాడి

తెచుకున్న మన తెలంగాణను ఈ రెండు జాతీయ 

పార్టీల దుర్మార్గుల చేతినుండి తెలంగాణ తల్లిని విడిపించి 

కొట్లాడితెచ్చు కొన్న తెలంగాణ ను మళ్ళీ నిలుపుకొని 

బంగారు తెలంగాణ ను నిర్మించు కుందాము. 

మోసపూరితమైన రెండు జాతీయ పార్టీలు మనల్ని నట్టేటముంచి

మన మీద స్వారి చేయాలని కుట్రలతో మాయమాటలతో

వంచించి, దగా చేసి, తెలంగాణ బిడ్డలకు తీరని ద్రోహము

చేస్తున్న సమయంలో    మన తెలంగాణను మనమే

పాలించుకుందాము, మళ్ళీ బంగారు తెలంగాణను నిర్మించుకొని  

భవిష్యత్ తరాలకు బాటలు వేయుదాము . 

మనందరము చైతన్యవంతులై ముఖ్యముగా ఇప్పటి

యువతరం భ్రమలను వదలి వాస్తవాలను అర్ధంచేసుకొని ,

మన కళ్లెదుటనే మాయమాటలతో ఓట్లు వేయించుకొని 

పూటకొక అబద్దం తో అన్ని వర్గాల వారి హృదయాలను 

గాయపరుస్తూ  గోస పెడుతున్నది  సత్యము కదా!

మన తెలంగాణ బిడ్డలను, రైతన్నలను కాపాడుకుందాము,

యువకులంతా నడుంకట్టి మనకు  BRS పార్టీ మాత్రమే

తెలంగాణకు శ్రీరామరక్ష అనే విశ్వాసంతో అందరినీ

చైతన్య పరచి ఈ సంవత్సర కాలం BRS కార్యక్రమాలను

ఊరూరా అమలు పరుచుకుందాము, జై తెలంగాణ.



(1) ఊరేగే మేఘమాల

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ నాడు దాచుకున్న భాగ్యమో ఈ జన్మలో

బాల్యంలోనే భక్తి మొగ్గ తొడిగింది. పది పదిహేను సంవత్సరాల మధ్య వయస్సులో

భగవంతుని చూడాలని తీవ్రంగా పరితపించే వాణ్ణి. ఆ బాధలో ఆకలి వేస్తున్నా ఒక్కో

పూట అన్నం తినేవాణ్ణి కాదు. ఆరోగ్యం సరిగ లేదని సాకు చెప్పి, దుప్పట్లో తల

దూర్చి రోదించే వాణ్ణి. ఆ దశలో భగవంతుడంటే ఏమిటో కూడా తెలియదు. భగవద్గీత

తెలియదు. జ్ఞానము అసలే లేదు. భగవంతుని కొరకు వ్యధ చెందడమే తెలుసు.

మా ఊరి సమీపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. దూరమైనా, అక్కడికి వెళ్ళి

కూర్చొనేవాణ్ణి. చల్లని నదీ జలాన్ని పానం చేసి, పచ్చని మామిడి చెట్లను చూస్తూ,

దూరంగా గోచరించే గిరి శిఖరాలను వీక్షిస్తూ, ఏకాంతంలో కొన్ని గంటలు ఉండిపోయే

వాణ్ణి.

కృష్ణుడి కోసం ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనుపించేవి. కృష్ణుడు నీలమేఘ

శ్యాముడని హరికథలో విన్నాను. ఈ మేఘాలకి కృష్ణుని జాడ తెలిసే ఉంటుంది

అనిపించింది. అవి కృష్ణుణ్ణి చూస్తున్నాయి అని భావించాను. వాటిని చూస్తూ

విలపించాను. నన్ను కృష్ణుణ్ణి చూడ నివ్వండి అని ప్రార్థించాను. ఓ మేఘమా! నువ్వు

కొద్దిగా జరుగు, నేను కృష్ణుణ్ణి చూస్తాను అని ఏడ్చాను. మేఘం అలా తేలిపోతూ

ఉంది. కాని, కృష్ణుణ్ణి తన వెనుకే పెట్టుకొని నాకు చూపకుండా తీసుకెళ్ళి పోతోందని

అనిపించింది. చాలా బిగ్గరగా రోదించాను. కృష్ణుణ్ణి చూపమని పెద్దగా ఏడ్చాను. అదొక

పిచ్చి గానే ఇప్పుడు అనిపించవచ్చు. కాని, ఆ వయస్సులో అదొక అనుభూతి. ఇప్పటికీ

ఆ అనుభూతి నాలో పచ్చగానే ఉంది. వెచ్చగానే ఉంది. ఆ నాటి సన్నివేశాన్ని నాలో

నేను స్మృతికి తెచ్చుకున్నప్పుడు ఈ పాట వ్రాశాను.




Newer Posts Older Posts Home